నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. వినూత్న నాటకాలు, గద్యాలతో తనదైన ప్రతిభను చాటిన జాన్ ఫోసెను నోబెల్ సాహిత్య బహుమతికి ఎంపిక చేసినట్లు నార్వేలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించిది. జాన్ ఫోసె రాసిన వినూత్న నాటకాలు, గద్యాలు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని ఈ సందర్భంగా స్వీడిష్ అకాడమీ పేర్కొంది. జాన్ ఒలావ్ ఫోసె 1959లో నార్వేలోని హేగ్‌సండ్ ప్రాంతంలో జన్మించారు. ఏడేళ్ల వయసులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై.. చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఘటన.. రచయిత మారేందుకు ఆ ఘటనే ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందని చెబుతారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన లిటరేచర్‌లో పట్టా పొందారు. 1983లో ఆయన ‘రెడ్, బ్లాక్’ పేరుతో తొలి నవల రాశారు. ఆ తర్వాత అనేక నాటకాలు, చిన్న కథలు, కవిత్వాలు, చిన్నారుల కోసం పుస్తకాలను రచించారు. ముఖ్యంగా తన గద్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోసె.. తన రచనల్లో ఎక్కువగా మానవ జీవన స్థితిగతులను ప్రస్తావిస్తారు. మన వ్యక్తిగత జీవితాల్లో జరిగే రోజువారీ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని గద్యాలు, నాటకాలు రాశారు.
- Category
- NORWEGIAN NEWS
Commenting disabled.